హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఆలీబాబా నలభై దొంగల పార్టీ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జట్టుకట్టి వచ్చిన పార్టీలకు గట్టి బుద్ది చెప్పాలన్నారు. కూటమి కారణంగా తెలంగాణ వెనకబడి పోతుందన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహాకూటమి కాదు.. మాయ కూటమి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మేం చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని 100 సీట్లలో గెలిపిస్తాయని మంత్రి అన్నారు.




