హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ ప్రదర్శించిన ఓ కార్టూన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధృతరాష్టుడ్రితో, ఈఆర్‌వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇదే బ్యానర్‌లో సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను కూడా ఉంచారు. ఈ కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ, నూతనంగా నియమితులైన జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఎవరైనా ఇలాంటి కార్టూన్‌లు వేస్తే కాంగ్రెస్ నాయకులు సహిస్తారా? అని ప్రశ్నించారు. ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇలాంటి కార్టూన్లకు తెరలేపిందని ఓవైసీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు విూరి ప్రవర్తిస్తోందని ఓవైసీ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ కార్టూన్‌పై ఓవైసీ ఆగ్రహం




