కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటారని ఊహాగానాల మధ్య పోలీసుల ముందస్తు అరెస్టు అప్రజాస్వామికం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సామాన్ పేల్లి శేఖర్ అన్నారు
బిజెపి టీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంలో భాగంగానే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయని కేవలం ప్రజల మభ్యపెట్టడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు తెలంగాణకు దక్కవలసిన విభజన హామీల అమలు కోసం స్థానిక భాజపా నాయకులు జాతీయ కార్యవర్గ సమావేశాలలో చర్చకు తీసుకురావాలని డిమాండ్ చేశారు ముందస్తు అరెస్టు అయిన వారిలో కానిందే దినేష్ కుమార్ సీనియర్ నాయకులు నారాయణ పురుషోత్తం వున్నారు