కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పేద, బడుగు, బలహీన వర్గాల, ఆశాజ్యోతి, స్వార్థం, కల్మషం లేని స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని విజ్ఞతతో ఓట్లు వేసి గెలిపించాలని వూరే లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు, యువకులు, రైతు సోదరులు, వివిధ రకాల,వ్యాపారస్తులకు భవిష్యత్ తరాల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న వారికి టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిస్తూ.. రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని ఏద్దేవ చేశారు రైతు సోదరీ,సోదరీమణులారా,ప్రజలారా మునుగోడు శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి, వారికి సహకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని మునుగోడు రైతన్ననికి విజ్ఞప్తి చేశారు బిజెపి టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి రైతులకు వస్తున్న ఆదాయాన్ని దెబ్బతీసే విధానాలను కొనసాగిస్తుందని కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాధత్తం చేసే ఉద్దేశంతో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెస్తే సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ వారికి సపోర్ట్ చేసింది అన్నారు బిజెపి,టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలపై జిఎస్టిని విధిస్తున్నది ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి తోడుగా రెండు అధికార పార్టీలు కలిసి పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయరంగంపై అదరపు భారం పడుతున్నది అటు రైతులను, యువకులను మోసం చేస్తూ రెండు పార్టీలు ప్రజా వ్యతిరేకతను ముడగట్టుకుంటున్నాయని విమర్శించారు మునుగోడు నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా రైతు వ్యతిరేక పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు ప్రతి పౌరుడు కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు కుల,మతాలకు,రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది అన్నారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసధారాలను అధికంగా పెంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడు నడ్డి విరిచారని విమర్శించారు మళ్లీ రైతులు, యువకులు, సామాన్య ప్రజలు, గౌరవంగా ఉండాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీతో గెలవాలని అని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని ఘోరాలు చేస్తున్న ప్రజలు యువకులు, అప్రమత్తం కాకుంటే మీ భవిష్యత్ తరాల పిల్లలను నష్టపోతారని తెలిపారు మీ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వేసి అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని తెలిపారు