రేవులపల్లి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం పై ఖండించిన పెగడపల్లి నాయకులు 

పెగడపల్లి నవంబర్ 2(జనం సాక్షి )పెగడపల్లి ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని  పెగడపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అంబేద్కర్ సంఘ  అధ్యక్షులు ఆరెల్లి  లక్ష్మీరాజం అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షులు పొనగంటి రాజయ్య ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు చెందు
స్థానిక సర్పంచ్ మెరుగు శ్రీనివాస్  పెగడపల్లి అంబేడ్కర్ సంఘ అధ్యక్షులు బొమ్మెన రాజారత్నం  బొమ్మెన స్వామి నరసింహుని పేట సర్పంచ్ బాబు స్వామి అంబేద్కర్ సంఘ మండల నాయకులు కామాద్రి అరుణ్  ఇరుగురాల అజయ్ మొదుం పెల్లి అంజయ్య  దావుల దేవయ్య రాచర్ల సురేష్ ఆత్మకూరి రాజయ్య ఆత్మకూరు అంజయ్య ఆత్మకూరు చింటూ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు