మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 02,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నూతనంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందే మారుతి బాపూజీని నియమించడం జరిగింది ఈ సందర్భంగా అందే మారుతి బాపూజీని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది ,
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మారుతి అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో మారుతి జగిత్యాల జిల్లాలోని 18 మండలాల లోపల సేవాదళ్ కమిటీలు ఏర్పాటు చేస్తానని అన్నారు మరియు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించడానికి తీవ్రమైన కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు,రేషన్ షాపుల్లోనూ బియ్యము మరియు నిత్యవసర సరుకులు కిరోసిన్ చక్కెర పప్పులు గోధుమలు సబ్బులు చింతపండు అన్ని రకాల నిత్యవసర సరుకులను కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఇది నిరుపేదల పార్టీ అని అందమారతి బాపూజీ తెలియజేశారు ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ రేషన్ షాపుల్లోనూ నిత్యవసర సరుకులను ఇవ్వకుండా రద్దు చేశారు మారుతి నియమాకానికి కృషిచేసిన రాష్ట్ర ఆర్గనైజర్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ ముస్తాక్ హైమద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ జువ్వాడి నర్సింగారావు జువ్వాడి కృష్ణారావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బెజ్జారపు శ్రీనివాస్,పట్టణ యూత్ ప్రెసిడెంట్ జెట్టి లక్ష్మణ్, మెట్ పల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జబ్బర్, ఎండి షకిల్ యూత్ నాయకులు చెన్నూరి శివకుమార్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు దాసరి నరేష్, కాంగ్రెస్ నాయకులు
తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం




