మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 02,
జనంసాక్షి :
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సమావేశ మందిరంలో గల్ఫ్ బోర్డ్ జేఏసీ ఆధ్వర్యంలో, చైర్మైన్ గుగ్గిళ్ల రవి మాట్లాడుతూ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అని,నాటి నుండి నేటిదాకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేస్తునే ఉన్నాయని ఈ అసంబ్లీ మరియు పార్లమెంటు బర్జెట్ సమావేశాలోనైన గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలు న్యాయం చేయాలని,
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించి,గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలలి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రెసియా అందజేయాలని
కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ బీమాయోజన 10 లక్షల పాలసీని సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలని హైదరాబాద్ లో గల్ఫ్ కాన్సులేట్ లు ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవి గౌడ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఒక వేల ఈసారి రాష్ట్ర కేంధ్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ ల ఇండ్లను ముట్టడిస్తామని గ్రామాల్లోకి రానివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు కళాకారుల ఆటపాటలతో లింగంపల్లి నరేష్ ప్రభుత్వల పనితీరును ప్రశ్నించారు గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి కుటుంబాలను ప్రభుత్వాలే ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు మెట్పల్లి పట్టణానికి చెందిన తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షులు ఖాజా నిజామోద్దీన్ వీడియో కాల్లో మాట్లాడుతూ గల్ఫ్ లో మరణించిన కుటుంబాలను అదుకోవాలని గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలంగాణ బిడ్డలను విడిపించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు సుంధరగిరి శంకర్ గౌడ్ ,న్యాయవాది లింబద్రి , ఎండి అజీమ్, బైరి రవి కోట శ్రవణ్ మరియు గల్ఫ్ అమరుల కుటుంబీకులు గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
గల్ఫ్ కార్మికుల సంక్షేమనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలి




