నందిగామ; కాంగ్రేస్ హయాంలో దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ షర్మిల ఆందోలన వ్యక్తం చేశారు.మరో ప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం నందిగామ మండలం అనిగండ్ల పాడు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆ గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై షీలా దీక్షిత్, కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్న మహిళలకు మాత్రం రక్షణ లేదని ఆమె వాపోయారు. నిర్భయ ఘటన మరువక ముందే న్యూఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరగడం ఘోరమని అన్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రేస్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.తెనాలీలో ఆకతాయిల చేష్టల వల్ల ఓ బిడ్డ తల్లి బలైపోయింది, అయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని షర్మిల పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనకు మద్యం దుకాణాలే కారణమని తెలిపారు. ఇటువంటి అఘాయిత్యం జరుగుతున్న మద్యం అమ్మకాలు యద్దేచ్చగా జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రతి నెల మద్యం అమ్మకకాలను 15 శాతం పెంచాలని కిరణ్ టార్గెట్ విధిస్తున్నారని షర్మిల ఆరోపించారు. అందువల్లే మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయ పడ్డారు.గతంలో చంద్రబాబు పాలనలోనూ మహిళలకు రక్షణ లేదని షర్మిల వెల్లడించారు. ఆయన హయాంలో అనురాధ అనే యువతిపై యాసిడ్ దాడి జరిగితే కనీసం ఆర్థిక సాయం కూడా చేయలేదని షర్మిల ఈ సందర్బంగా గుర్తు చేశారు.సుప్రీంకోర్టు నష్టపహారం చెల్లించాలని చెప్పిన చంద్రబాబుకు సాయం అదించేందుకు మనసురాలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో మహిళలకు ఆర్థిక,సామాజిక భద్రత ఉండేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆయన తన సోదరిలా భావించారని వెల్లడించారు.మళ్లీ జగన్ సీయం అయ్యాక మహిళలకు రక్షణ కల్పిస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.




