Monday, 2 November 2026

కాకాకు ఘననివాళి

kakaa-oct-06

హైదరాబాద్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):కాకా అని ఆప్యాయంగా పిలుచుకునే జి.వెంకటస్వామి 87వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు రాజకీయ ప్రముఖులు. ఆయన సేవలు కొనియాడారు. కార్మిక, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు నేతలు.

పైసా లేకుండా విద్య అందిస్తున్నారు : కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం

కార్మిక మంత్రిగా బడుగు, బలహీన వర్గాలకు లక్షల ఇళ్లు ఇప్పించిన ఘనత వెంకటస్వామికే సాధ్యం అయ్యిందన్నారు కడియం శ్రీహరి. ఏడుసార్లు పార్లమెంటేరియన్‌ గా, కేంద్ర, రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా దళిత ఆత్మగౌరవ కోసం పోరాడాన్నారు. అంబేద్కర్‌ సొసైటీ ద్వారా ఉచితంగా విద్య అందించటం ఆయన దూరదృష్టికి నిదర్శనంగా కీర్తించారు. ఆయన ఆశయాలను వివేక్‌, వినోద్‌ ముందుకు తీసుకెళ్లి ఈ తరానికి కాకా జీవితాన్ని తెలియజేయాలని ఆకాంక్షించారు. ? కాకా సేవలను స్మరించుకోవటం మనందరికీ గౌరవం. ఆ సేవల్లో భాగస్వామ్యం అవుతామన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడారు : మహ్మద్‌ అలీ, డిప్యూటీ సీఎం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకా చేసిన కృషి మరువలేనిదన్నారు మహ్మద్‌ అలీ. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తపించారన్నారు. పార్టీతోనూ కొట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అంబేద్కర్‌ కాలేజీల ద్వారా వేలాది మంది దళిత పిల్లలకు విద్య అందిస్తూ.. ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. వివేక్‌, వినోద్‌ ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

కాకా కుటుంబంలోని వ్యక్తిని : కె.కేశవరావు, ఎంపీ

వెంకటస్వామి కుటుంబంలో వ్యక్తిని అన్నారు ఎంపీ కె.కేశవరావు. కార్మిక సంఘాలను ప్రోత్సహించి.. వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడిన మ¬న్నత వ్యక్తిగా కీర్తించారు. నిరంతరం ప్రజల పక్షపాతిగా.. వాళ్ల సంక్షేమం కోసం ఎన్నో కార్మిక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాకాకే సాధ్యం అయ్యిందన్నారు.

కార్మికుల పక్షపాతి : నాయిని, ¬ం మినిస్టర్‌

కాకా.. బడుగు, బలహీన వర్గాల మనిషి అన్నారు ¬ంమినిస్టర్‌ నాయిని నర్సింహారెడ్డి. ప్రతి సంస్థలో కార్మిక సంఘాలు ఏర్పాటయ్యే విధంగా కృషి చేశారన్నారు. సింగరేణి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నది అంటే అది కాకా చేసిన కృషి అన్నారు. కాకా జీవితం ఎందరికో ఆదర్శం అని.. ఈ తరానికి పరిచయం చేయాల్సి అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆయన కుమారులు వివేక్‌, వినోద్‌ నిర్వహించే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుందన్నారు నాయిని.

తెలంగాణ రావాలని బలంగా కోరుకున్న వ్యక్తి కాకా: హరీశ్‌

వయసులో ఎంత పెద్ద వారైనా వెంకటస్వావిూని అందరం కాకా గా పిలుచుకున్నాం? ఆయన రాష్ట్రానికే కాకా అన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌ రావు. సికింద్రాబాద్‌ లో జరిగిన టీఆర్‌ ఎస్‌ జల సాధన సమితి విూటింగ్‌ కి గొంగడి కప్పుకొని వచ్చారన్నారు. తెలంగాణ రావాలని ఆ విూటింగ్‌ లో ఒక జోష్‌ ను గుర్తించినట్టు కాకా తెలాపారని హరీశ్‌ అన్నారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ , టీఆర్‌ ఎస్‌ అలయెన్స్‌ జరగాలని వెంకటస్వావిూ కోరుకున్నారన్నారు. కేసీఆర్‌ దీక్షకు వెంకటస్వావిూ నిమ్స్‌ కు వచ్చి మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్‌ కాలేజీ స్థాపించి ఎంతో మంది ఇంజనీర్లను, ఐఏస్‌ , ఐపీఎస్‌ భవిష్యత్తునిచ్చిన గొప్పనాయకుడు వెంకటస్వావిూ అని కొనియాడారు. పేద వర్గాల కోసం, సింగరేణి కార్మికులకోసం కాకా చేసిన సేవలు ఎవరూ మరిచిపోరు..రాబోయే రోజుల్లో కాకా గారిని స్థిర స్థాయిగా గుర్తించుకునేలా కేసీఆర్‌ నాయకత్వంలో ఈ ప్రభుత్వం మరింత ముందుకెళుతుందన్నారు.

షెర్వానీ ధరించడంలో కాకా తర్వాత రెండో వ్యక్తి వివేక్‌: డీఎస్‌

ట్రేడ్‌ యూనియన్‌ కోసం, కార్మికులకోసం, పేదల కోసం కాకా ఓ సంస్థగా ఎదిగారన్నారు ఎంపీ డీ శ్రీనివాస్‌. వీకర్‌ సెక్సన్‌ ప్రజల బంధువుగా కాకా ఎదిగారు. ఆయన అడుగుజాడలోనే ఆయన కుమారులు మాజీ ఎంపీ వివేక్‌, వినోద్‌ లు నడుస్తున్నారు. షెర్వానీ ధరించడంలో కాకా తర్వాత రెండో వ్యక్తి వివేక్‌. ఆ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలని కోరారు డీ ఎస్‌.  పీసీసీ ప్రెసిడెంట్‌ గా ఉన్నప్పుడు వెంకటస్వావిూ తనకు ఎన్నో సలహాలిచ్చారన్నారు. తెలంగాణ సాకారంలో కాకా సేవలు చిరస్మరణీయం అన్నారాయన.

కార్మికుల సంక్షేమం కోసం తపించారు : వివేక్‌, మాజీ ఎంపీ

అహర్నిశలు కార్మికుల సంక్షేమం కోసం వెంకటస్వామి కృషి చేశారన్నారు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ వివేక్‌. 75వేల మంది పేదలకు ఇళ్లు ఇప్పించి.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 36 ఏళ్లుగా అంబేద్కర్‌ కాలేజీల ద్వారా ప్రతి సంవత్సరం 2వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందించటం ఆయన చేసిన కృషికి నిదర్శనం అన్నారు. పెన్షన్‌ స్కీమ్‌ తో కార్మిక జీవితాల్లో మార్పు తీసుకొచ్చారన్నారు. 1995లో సింగరేణికి ఔుఖఅ ద్వారా 400 కోట్లు సాయం చేయించి.. సంస్థను నిలబెట్టిన ఘనత ఆయనదే అన్నారు. ఇవాళ లక్షల మంది కార్మికులు పని చేయటం వెనక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ కోసం కొట్లాడారన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు చెప్పారు.

నాన్నగారి జయంతిని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు: వినోద్‌

వెంకటస్వావిూ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించడం సంతోషం అనిపించింది. నాన్న గారి విూదున్న విశ్వాసమే ఇవాళ ఈ కార్యక్రమం ఇంతమంది సమక్షంలో సక్సెఫుల్‌ గా ముందుకు నడిపించింది. దళితులకు మూడేకరాల భూమిని ఇస్తుంన్నందుకు కేసీఆర్‌ కు ధన్యవాదాలు. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి విజయవంతమైన పథకాలు అందించడంలో హరీశ్‌ రావు ఎంతగానో శ్రమిస్తున్నారు. మా తండ్రిగారి జయంతి కార్యక్రమానికి వచ్చిన  డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, కడియం శ్రీహరి, ఎంపీ డీ శ్రీనివాస్‌, కేకే, మంత్రులు, ఎమ్‌ ఎల్‌ ఏలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మాజీ కేంద్ర మంత్రి జీ వినోద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *