Monday, 2 November 2026

అశోక్‌లేలాండ్‌తో తెెలంగాణ సర్కారు భారీ ఒప్పందం

untitled-1హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ నెలకొల్పే ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్‌ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు, పరిశ్రమలు, ఐటి, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.టి. రామారావు, విద్యుత్‌, షెడ్యూల్‌ కులాల శాఖల మంత్రి జి. జగదీష్‌ రెడ్డిల సమక్షంలో హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. సిఎంవో అదనపు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతి కుమారి, అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఎం.డి వినోద్‌ కె దాసరి అవగాహన ఒప్పందాలు మార్చుకున్నారు.ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టిఎస్‌ ఐపాస్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్‌.టి.సి.కి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సిఎం తెలిపారు. జి.హెచ్‌.ఎం.సి.కి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మాస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ సిస్టం మెరుగుపరచడానికి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సలహాలు తీసుకోవాలని ట్రాన్స్‌ పోర్ట్‌, ఆర్‌.టి.సి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.తెలంగాణలో పట్టణ జనాభా 45 శాతం ఉందని వారికి సౌకర్యంగా ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని సిఎం కేసీఆర్‌ వివరించారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్‌ కు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్‌ మాణిక్‌ రాజ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, టిఎస్‌ ఐఐసి ఎండి ఇవి నర్సింహారెడ్డి, అశోక్‌ లేలాండ్‌ సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్స్‌ పి. వెంకట్రామన్‌, ఇ. హరిహర్‌, హిందూజా ఫౌండేషన్‌ సిఇవో డిఎం రెడ్డి, ఇడి రాజీవ్‌ సింఘ్వి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మానుఫాక్చరింగ్‌ యూనిట్‌ను అశోక్‌లేలాండ్‌ కంపెనీ నెలకొల్పనుంది. యూనిట్‌ నెలకొల్పేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుమారు వెయ్యి మందికి ఈ ఎ/-లాంట్‌ ద్వారా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరిశ్రమలకు భూమి, మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. ఆర్టీసీ, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వాహనాలను స్థానిక పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామని చెప్పారు. తెలంగాణలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు ప్రభుత్వంతో అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనుంది. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి సమక్షంలో కంపెనీ ఎం.డి వినోద్‌ కె దాసరి ఒప్పందం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *