కాబూల్‌లో జంట పేలుళ్లు – 21మంది మృతి, 27మందికి తీవ్రగాయాలు
కాబూల్, జనం సాక్షి ) : ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం నెత్తురోడింది. సోమవారం ఉదయం షష్టారక్ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 21 మంది
మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ విూడియా సంస్థ ఏఎఫ్‌పీకి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై మృతిచెందారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.