ఊపిరాడక డ్రైవర్ మృతి
హైదరాబాద్, జూన్23(జనం సాక్షి) : నగరంలోని కూకట్‌పల్లి జయానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిండిన వర్షపునీరు కారు డ్రైవర్ మృతికి కారణమైంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా స్థానిక మయూరీ రెసిడెన్షియల్ సెల్లార్‌లోకి నీరు చేరింది. అయితే అంతకుముందే ఇంటి యజమానిని తీసుకువచ్చిన డ్రైవర్ గోపి… కారును సెల్లార్‌లో పార్కింగ్ చేసి, అందులోనే నిద్రపోయాడు. అనంతరం వర్షం కారణంగా సెల్లార్‌లోకి భారీగా వర్షం నీరు పోటెత్తింది. గోపీ నిద్రిస్తున్న కారు
మునిగిపోయింది. కారులో ఊపిరాడక అతను మృతి చెందాడు. శనివారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులు సెల్లార్‌లోని నీటిని తోడేయడంతో కారులో గోపీ మృతదేహం బయటపడింది. దీనిపై అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారులోకి వర్షపు నీరు




