కారు గుర్తుకు ఓటువేసి వెంకట్రాం రెడ్డి ని గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: పేద ప్రజలకు నిరుద్యోగ యువత శిక్షణ ఉద్యోగం కల్పించడానికి మెదక్ ఎంపీగా అభ్యర్థిగా బి ఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వెంకట్రాంరెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని పర్కిబండ తాజా మాజీ సర్పంచ్ పూల అర్జున్,మాజీ జడ్పీటీసీ నారాయణ గౌడ్ ఓటర్లను కోరారు. మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనుల వద్ద ప్రచారం నిర్వహించారు.సందర్భంగా కూలీలతో మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.బిఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రతి మండలానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి ఉచితంగా పెండ్లిలకు ఇస్తామని, నిరుద్యోగ యువతకు వెంకట్రాంరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని మీ బిడ్డల భవిష్యత్తు కు అండగా వెంకట్రాంరెడ్డి అండగా ఉంటారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వ ఆయాం లో 11 సంవత్సరాలు కలెక్టర్ గా పనిచేసిన అనుభవన వెంకటరామిరెడ్డి ఉందని ఉన్నత పదని వదులుకొని పేదలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు.అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు మల్లేష్, నాగేష్,కొమురెల్లి,కిష్టయ్య,రవి శంకర్,మురళి,నరహరి,నవీన్ ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు.