కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా వసూలు చేస్తున్నారు. విద్య నేడు వ్యాపారంగా పరుగెడుతుంది. దీంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందని వరంగా తయారయింది. రాష్ట్రంలో ప్రధాన కార్పోరేట్ కళాశాలలు పాఠశాలలు ప్రతి సంత్సరం ఎడాపెడా ఫీజలు పెంచుతూ తల్లిదండ్రులపై మోయలేని బారాన్ని మోపుతు న్నాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు చట్ట విరుద్దంగా వేలాదిగా విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. క్రమంగా ఫ్రభుత్వం అనుమతి లేకుండా వెలుస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కార్పొరేట్ విద్యాసంస్థల యాజమానులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఫ్లెక్సీలు వాల్‌రైటింగ్ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించుకుంటూ మాయ చేస్తున్నారు. ఫీజులు డోనేషన్లు పుస్తకాలు, దుస్తులు, టూషన్స్ వివిధ రకాల పేరిట ఫీజులను దండుకుంటున్నారు. కొన్ని కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఏసిల పేరిట వసూలు చయడం అనవాయితీగా మారింది.. విద్యార్థులకుఫీజలు మొతలతో అనేకం గా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. విద్యాశాఖాధికారులు నెల నెల విద్యాసంస్థల యాజమానుల నుంచి మామూళ్లు దండుకుం టున్నారు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనుంచి విద్యా ప్రనమాణాలు అందిస్తున్నామని భ్రమలలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పిల్లలను కార్పోరేట్ విద్యా సంస్ధల్లో చేర్చడానికి పోటీ పడుతున్నారు. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు కూనరిల్లుతున్నాయి. రానున్న రోజులలో ప్రైవేటీకరణ విద్యను అరికట్టకపోతే పీడిత తాడిత విద్యార్థులకు చదువు దూరమవుతుంది. ఆర్ధిక అసమానతలు మరింత పెరగనున్నాయి. విద్యారంగం నేడు అంగడి సరకుగా మారింది. విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలు బంగారు భవిష్మత్తునివ్వాలని తపనతో కోటీ ఆశలతో అప్పులు చేసి స్థిరాస్థులను తెగనమ్మి పరువు ప్రతిష్టల కోసం తమ పిల్లలను కార్పొరేట్ సంస్థల్లో చదివిస్తున్నారు. మరికొంతమంది బంధువులతో పోల్చుకుని గొప్పల కోసం తమ పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్ధల్లో చదివిస్తున్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారనీ అంటే అదీ లేదు. బట్టీ చదువులు విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారు. దీని మూలంగా విద్యార్థుల్లో సృజనాత్మకత తెలివి తేటలు ఆలోచనలు తగ్గిపోతున్నాయి. బట్టీ చదువులతో విద్యార్ధుల్లో యాంత్రీకీకరణ జరుగుతుంది. ఇది మానవ వనరుల అభివృద్దికి విద్యా వికాసానికి గొడ్డలిపెట్టు. విద్యార్థులు మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు. మెదడు కు మించి చదువుల భారాలు పెరుగుతున్నాయి. మరోవైపున చదువులు సారెడు బలపాలు బారెడు తలకుమించి విద్యార్థులకు పుస్తకాలు భారాలు వేయడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల యజమానులు కజ్జా చేశారు. కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. డె స్కాలర్స్‌కు బక సంవత్సరానికి 30 వేల రూపాయల నుంచి లక్షా 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక్కోక్కరికి 65 వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోవడంతో ఇష్టానుసారంగా పెంచుకుంటూ కోట్లలో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఫీజులను కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, సిండికేట్లు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులను ఎందుకు పెంచుతు న్నారని నిలదీస్తే ఉపాధ్యాయుల వేతనాలు, పాఠశాలల నెలకిరాయిలు, కరెంటు బిల్లులు, పెరిగాయి కాబట్టి విధిలేని పరిస్థితిలో పెంచాల్సివస్తుందని విద్యాసంస్థల యాజమాన్యాలు దొంగ తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి ఆదోచుకుం టుంటే ప్రభుత్వం మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరి స్తుంది. దీంతో కార్పొరేట్ యజ మానఉలు మరిత రెచ్చిపోతు న్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు అసెంబ్లీలోఒ చట్టం తేవాలని మెడ ిసిన్ ఇంజనీరింగ్ కళాశాల మాది రిగా ఫీజు రెగ్యులేటరీ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని బిసి సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధిలకు డిమాండ్ చేశారు. కార్పోరేట్ కళాశాలల్లో సైన్స్, మ్యాధ్స్ ప్రాక్టికలల్‌కు పదివేల రూపాయలు కామర్స్ ఫ్యాకల్టీకి ఆరు వేల నిర్ణయించారు. విద్యా సంస్థల్లో పనిగంటలను నియం త్రించాలి.న బొధనలో సంస్కరణలు తెచ్చి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి నాణ్యమయిన విద్యతో పాటు చదువు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు వ్యాస రచన పోటీలు నిత్యం నిర్వహించాలి మౌళిక వసతులు కల్పించాలి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత నిర్భంధ విద్యను అమలు చేసి ప్రయివేటు విద్యను అరికట్టాలి. ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. కార్పోరేట్ విద్యా సంస్ధల్లో ఫీజలు నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మంచిది అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పేద విద్యార్థులవైపనా లేక, కార్పోరేట్ విద్యా సంస్థల యాజమానుల వైపా, కొద్ది రోజులలో తేలిపోతుంది. ఫీజలు నియంత్రణ సబ్‌కమిటీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలలో బిల్లుపెట్టి చట్టం తీసుకు రావాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం నిజాయితీ చిత్తశుద్ది ఏమిటో నిరూనపితమవుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫీజులను పరిశీలిస్తే ఎంతో దోపిడి పెరిగిపోయిందీ ఆయనకే తెస్తుంది. విద్య అందరికి హక్కు నినాదంతో ఫ్రభుత్వం మరిన్ని చర్చయలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విద్యను ప్రయివేటీకరణ తరిమికోట్టి ప్రభుత్వ విద్యా సంస్థలన మరింత మెరుగపర్చాల్సిన అవసరముంది. ఫీజుల నియంత్రణ, కార్పోరేట్ విద్యాసంస్థల్లో మౌళిక సదుపాయాలు సమస్యలు కొట్టుమట్టాడుతున్నాయి. కార్పోరేట్ సంస్థల్లో విద్యార్థులకు ఆట స్థలాలు లేక సతమతం అవుతున్నారు. జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి గ్రంథాలయాలు లేకపోవడం. ఇంటర్మీడియట్ చదువుకున్న వారిని టీచర్లుగా నియమించు వారికి చెల్లించే వేతనాలు మాత్రం మూడు వేల నుంచి ఆరువేల రూపాయలు చెల్లిస్తున్నారు. టీచర్లతో వెట్టి చాకిరి పనులు చెయిస్తున్నారు. చాలీ చాలనీ వేతనాలతో టీచర్లు సతమతమవు తున్నారు. విద్యార్థులనుఇరుకుడు తరగతి గదులలో బందించుతూ బలవంత్గం4ఆ అర్థంకాని చదువుల బోధనలు చేయిస్తున్నారు. వారు అన్నంత ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను వేదిం పులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఉపనాధ్యాయులకు బడిబాట నిర్వహించినా ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే. ముప్పై మంది ఉన్న విద్యార్థులు పాఠశాలలు మూసివేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. రాను రాను ప్రభుత్వ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. విద్యార్థి సంఘాలు ఉద్యమిం చాల్సిన అవసరముంది. అందరికి విద్య అనే నినాదంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు చెపట్టాల్సి ఉంది.
డిమాండ్స్:-
1)కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఫీజలు నియంత్రణకు అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టం తీసుకురావాలి.
2)అక్రమంగా పేదల నుంచి వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
3)అందరికి విద్య అందుబాటులో ఉండాలి.
4)విద్యను వ్యాపార ధోరణి విడనాడాలి
5)విద్య ప్రయివేటికరణను తరిమికొట్టాలి
6)ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగుపర్చాలి.
7)ఇంజనీరింగ్, మెడిసన్ కళాశాలల మాదిరిగా ఫీజు రెగ్యులెటరీ కమిటీ పరిధిలోకి తేవాలి
8)విద్యా బోధనల్లో సంస్కరణలు తీసుకురావాలి
9)విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి
10)నాణ్యమయిన విద్యను అందించాలి
11) ప్రభుత్వ అనుమతుల లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలను మూసివేయాలి
12)కార్పోరేట్ కళాశాలల్లో సైన్స్, మ్యాథ్స్ ఫ్యాకల్టీలకు 10 వేలు, కామర్స్ ఫ్యాకల్టీలకు 6 వేల రూపాయల వేతనాన్ని నిర్ణయించాలి.న
13) ప్రయివేట్ కార్పోరేట్ విద్యాసంస్థల్లో క్వాలిఫయిడ్ టీచర్లను నియమించాలి.ప
14) ఒక్క తరగతి గదుల్లో ముప్పై మంది విద్యార్థులకుమించి ఉండకూడదు.
15) ర్యాంకులను నివారించాలి. కార్పోరేట్ ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చట్టపరమయిన చర్యలు తీసుకోవాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా ప్రయివేట్ విద్యాసంస్థల యజమానులు పాటించాలి, అప్పుడే అందరికి విద్య అందుతుంది.
– దామెరపల్లి నర్సింహారెడ్డి
9059933253




