విజయవాడ: కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. పెళ్లి బృందం చల్లపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ దర్ఘటన చోటు చేసుకుందని తెలిసింది.




