Tuesday, 3 November 2026

బీహార్‌ సీఎంగా నితీష్‌ కుమార్‌?

నితీష్‌ నాయకత్వానికి లాలూ సమర్థన!

పాట్న, ఫిబ్రవరి 4 : బీహార్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికారపక్షం జేడీయూలో విభేదాలు చోటుచేసుకోవడంతో నాయకత్వ మార్పు జరగవచ్చునని తెలియవచ్చింది. మాజీ సీఎం నితిష్‌కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఏన్నికల్లో తమ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్‌ కుమార్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఆయన స్థానంలో జితేంద్రా మాంజీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇన్ని రోజులు కుల సమీకరణాల రీత్యా జితేంద్రను సమర్థిస్తూ వచ్చారు. ఈ ఏడాది బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే జితేంద్ర పార్టీ విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయలేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో లాలూ కూడా నితీష్‌ నాయకత్వానికి మొగ్గు చూపుతున్నారని తెలియవచ్చింది. దీంతో నితీష్‌ మరోసారి సీఎం పగ్గాలు అందుకుంటారని సమాచారం బుధవారం నితీష్‌ పాట్నలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *