Wednesday, 4 November 2026

కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి: మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పనుల పురోగతిపై జలసౌధలో అధికారులతో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సవిూక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో మంత్రి సవిూక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉండి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. మోటార్ల బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. 2018, డిసెంబర్‌ నాటికి తోటపల్లి పంప్‌ హౌజ్‌ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని ఇంజినీర్లు, ఏజెన్సీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా ఉండేలా చూస్తామని మంత్రి హరీష్‌రావు హావిూ ఇచ్చారు.