కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకుంటే..
చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి?
– గోదావరి నీటిలో 954టీఎంసీలు మన హక్కు
– ఎవరు అడ్డిపడినా ప్రాజెక్టులు ఆగవు
– రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట, జూన్23(జనం సాక్షి) : మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. నంగునూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును కడుతుంటే పక్కన ఉన్న బాబుకు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు రావడంతో జీర్ణించుకోని చంద్రబాబు.. ఎలాగైనా ఆ ప్రాజెక్టును ఆపాలని ఢిల్లీకి ఫిర్యాదు చేసిండని మంత్రి తెలిపారు. గోదావరి నీళ్లల్లో 954 టీఎంసీలు మన వాటా.. మన హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని ఆయన చెప్పారు. కలిసి ఉన్నంత కాలం మన నీళ్లు దక్కడం లేదనే వేరు పడ్డామని హరీశ్‌రావు తెలిపారు. చంద్రబాబు అప్పుడేమో తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాడు. ఇప్పుడేమో ప్రాజెక్టులు కడుతుంటే ఓర్వలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరూ అడ్డుపడినా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతాం.. రైతులకు నీళ్లు ఇస్తామని మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. అప్పుడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు, ఇప్పుడు మనం ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఓర్వలేకపోతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణలో ప్రాజెక్టులు కడతామని, రైతులకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు రావడంతో జీర్ణించుకోలేని చంద్రబాబు దీన్ని ఎట్లయినా ఆపాలని ఢిల్లీకి ఫిర్యాదు చేసిండని మండిపడ్డారు. మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.గోదావరి నీళ్లల్లో 954 టీఎంసీలు మనవాట, మనహక్కు ఉన్నదని హరీశ్ స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమన్నారు. కలిసి ఉన్నంత కాలం మన నీళ్ళు మనకు దక్కడం లేదనే వేరు పడ్డామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్ననాడు, వేరు పడిన నాడు మనకు 954 టీఎంసీల వాటా ఉన్నదని అప్పటి ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చిందని గుర్తుచేశారు.