విజయవాడ : గోవుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే పాతబస్తీలోని గోశాలలో కలుషిత దాణా తిని 17 ఆవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కావాలనే కొంతమంది ఆగంతకులు గోవులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బలవంతంగా గోవులకు ఏదో ద్రావకం తాగించినట్లు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.




