Tuesday, 3 November 2026

కాశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల ఎన్‌కౌంటర్‌

హిజ్‌బుల్‌ ముజాయిదిన్‌ కమాండర్లు మృతి చెందినట్లు సమాచారం
హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్‌బుల్‌ ముజాయిదిన్‌ కమాండర్లు తారిక్‌ మౌల్వీ అలియాస్‌ ముఫ్తీ వకాస్‌, లతీఫ్‌ టైగర్లు హతమైనట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లోని సోఫియాన్‌లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే అధికారులు ఈ విషయాన్ని ద్రువీకరించాల్సి ఉంది. ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా గాయపడ్డారు. సోఫియాన్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత ఏడాది హతమైన బుర్హన్‌ వాని బృందానికి చెందిన మిలిటెంట్లలో లతీఫ్‌ టైగర్‌
చివరివాడు అని అధికారులు చెబుతున్నారు. సోఫియాన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ దగ్గర ఉన్న అద్‌కారా ఏరియాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే ఈ ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. రాష్టీయ్ర రైఫిల్స్‌తో పాటు స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ ఈ ఆపరేషన్‌ చేప్టటింది. షోపియాన్‌ జిల్లా ఇమాంసాహిబ్‌ పట్టణంలోని అద్కర ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారని అందిన సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. అంతలో మిలిటెంట్లు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్‌ గాయపడటంతో అతన్ని శ్రీనగర్‌ లోని ఆర్మీ బేస్‌ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిపిన మిలిటెంట్ల కోసం జవాన్లు గాలిస్తుండగా వారు తారసపడ్డారు. వారు కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. ఈ సందర్భంగా షోపియాన్‌ జిల్లాలో ఇంటర్‌ నెట్‌ సర్వీసును నిలిపివేశారు. మిలిటెంట్ల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది.