శ్రీనగర్: అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. భారీ భద్రతను చేపట్టి పోలీసు ఉన్నతాధికారులు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో కేబుల్, ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. కాశ్మీర్ వ్యాప్తంగా నిన్న జరిగిన అల్లర్లలో 23 మంది పోలీసులు సహా 36 మంది గాయపడ్డారు.




