హైదరాబాద్ (జనంసాక్షి ): పెట్రోలియం శాఖలో కీలక పత్రాల లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. తాజాగా మరికొన్నిచోట్ల సోదాలు చేశారు. పలు కార్పొరేట్ కంపెనీలు సహా నిందితుల ఇళ్లలో రైడ్ చేశారు. పెట్రోలియం శాఖలోనే కాకుండా.. డిఫెన్స్, పవర్, కోల్ మినిస్ట్రీల్లోనూ కీలక డాక్యుమెంట్లను వారు లీక్ చేసినట్టు గుర్తించారు. బడ్జెట్ ప్రసంగం కాపీలను వారి దగ్గరి నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం కోసం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.




