అలహాబాద్: కుంభమేళాలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సెక్టార్ 4 పరిధిలోని మహామండలీశ్వర్ నగర్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ భక్తుడు సజీవదహనమయ్యాడు. మరో ఐదుగురుకి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మౌని అమావస్య సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 30 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే.




