Sunday, 8 November 2026

కుటుంబ కలహాలతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్మ

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్య సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ క్రమంలో భయంతో హనుమంతు తన రెండో భార్య చంద్రకళ, తన తొమ్మిదేళ్ల కుమార్తె మంజులతో కలిసి శనివారం ఉదయం ఉరివేసుకుని బలవన్మరణం చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.