హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): కుటుంబ కలహాలతో కొత్తగా వివాహమైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నాగారం వెంకటేశ్వరనగర్ కాలనీలో జరిగింది. కీసర సీఐ ప్రకాశ్ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పాలెంకు చెందిన తన్నీరు వెంకాయమ్మ మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం తన ఇద్దరు కొడుకులతో వలస వచ్చి నాగారంలో నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం పెద్ద కొడుకు కల్యాణ్ వివాహం అరుణతో జరిగింది. కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఇంట్లో
గదిలోకి వెళ్లిన కల్యాణ్ తలుపులు పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా స్పందించలేదు. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




