భూమి కుంగుబాటు కారణాలు ఆరాతీయండి
దీపావళి లోగా తిత్లీ బాధితులకు సహాయం
టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,నవంబర్5(జనంసాక్షి): పోలవరం వెల్లే రహదారిని తక్షణం మరమ్మత్తులు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అక్కడి మట్టి నమూనాలు సేకరించి భూమి కుంగడానికి గల కారణాలను ఆరా తీయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సవిూక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి ఉబికి, కుంగి, బీటలు వారిన దృశ్యాలను సీఎం పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి జరగలేదని చంద్రబాబుకు అధికారులు వివరణ ఇచ్చారు. కాగా మట్టి నమూనాలపై పరిశోధనశాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని సీఎం సూచించారు. రహదారి కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు సరిజేసి సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలియజేశారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులు అన్నీ పూర్తి అవుతాయని తెలిపారు. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇకపతోఏ తిత్లీ తుపాను బాధితులకు దీపావళి పండగకు ముందు రోజే రూ.530కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లుచంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు విత్తనాల సరఫరా చేయటంలో నిర్లక్ష్యం వహించిన బాపట్ల వ్యవసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. రబీలో వందశాతం కంటే అధికంగా సాగుచేసిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరవు బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఆదేశించారు. ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి.. యూనిట్ల మంజూరు శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా మందుల కొరత లేకుండా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆవిష్కరణలు నిరంతరం కొనసాగాలని..సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.




