ఆందోళనకు దిగిన కార్మికులు
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): ఆర్టీసీ బస్సు ఢీకొని జీహెచ్‌ఎంసీ ట్రాలీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ (35) బోరబండలో నివాసం ఉంటున్నాడు. బియ్యం తీసుకురావడానికి స్వగ్రామానికి వెళ్లిన శ్రీనివాస్ తిరుగు ప్రయాణంలో ముసాపేటలోని లక్ష్మీకళ థియేటర్ వద్ద బస్సు దిగాడు. రోడ్డు దాటే క్రమంలో ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. అతని తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ట్రాలీ కార్మికులందరూ ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో కార్మికులు శాంతించారు.




