Saturday, 7 November 2026

కుప్పకూలిన శిక్షణ విమానం

రంగారెడ్డి,నవంబర్‌21(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ శివారులో బుధవారం ఉదయం శిక్షణ విమానం కుప్పకూలింది. శంకర్‌పల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే విమానం కిందపడ్డంతో ఎవరికి ఎలాంటి ప్రమాదంలో జరగలేదు. పొలంలో పడిన విమాన శకలాలను చూసేందుకు సవిూపంలో నివసిస్తున్న ప్రజలు తరలివస్తున్నారు. వాటితో ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్నారు.