Tuesday, 3 November 2026

కులవృత్తులకు తోడుగా ఉండేందుకే ఆదరణ: పుట్టా సుధాకర్‌ యాదవ్‌

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రభుత్వం కులవృత్తుల వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని టిటిడి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. అందులో భాగంగానే ఈ ఆధునిక పనిముట్లను ఆదరణ పథకం ద్వారా అందిస్తున్నామన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు టిటిడి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చేతుల విూదుగా మంగళవారం ఆదరణ పథకం కింద మంజూరైన ఆధునిక పనిముట్లను అందజేశారు. మెప్మా సాంకేతిక అధికారి కాంతయ్య మాట్లాడుతూ.. మైదుకూరు మున్సిపాలిటీ చాపాడు మండల పరిధిలో 600 మంది ఆదరణ పథకం కింద దరఖాస్తు చేసుకోగా 130 మంది లబ్ధిదారుని వాటా కింద డిడి లను అందజేయగా, 50 ఆధునిక పనిముట్లు మంగళవారం ఇస్త్రీ పెట్టె, వైబ్రేటర్‌ జనరల్‌ పవర్‌ టూల్స్‌ వంటి పనిముట్లను మిగిలిన లబ్ధిదారులకు అందచేశామన్నారు. లబ్ధిదారులు కూడా వీలైనంత తొందరలో డీడీలను సమర్పించవలసిందిగా కోరారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా వీలైనంత తొందరలో పనిముట్లు అందచేస్తామని తెలపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రంగ సింహ, టిడిపి పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ ఎపి రవీంద్ర, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బి పి.సుధాకర్‌ రెడ్డి, నాయకులు బిఎన్‌ కిట్టు, ఐత బాబు, మారుతి, నాయబ్‌ రసూల్‌, రామచంద్ర, సుందరం, అధికారులు, మున్సిపాలిటీ కవిూషనర్‌ కఅష్ణ జిలాని భాష, తదితరులు పాల్గొన్నారు.