
హైదరాబాద్,డిసెంబర్ 28(జనంసాక్షి): సిలికానాంధ్ర ఆధ్వర్యంలోగచ్చిబౌలి స్టేడియంలో మూడురోజుల పాటు సాగిన నాలుగో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. తెలుగు రాష్గాలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన 6,327 మంది కళాకారులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చక్రపాణి… సిలికానాంధ్ర సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే కూచిపూడి నృత్య వికాసానికి ప్రభుత్వం తరఫÛన సహకారం అందిస్తామన్నారు. 2016 డిసెంబరు 23, 24, 25 తేదీల్లో కృష్ణా జిల్లా కూచిపూడిలో అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందిచాలనేదే తమ సంస్థ ఉద్దేశమని అన్నారు.
కూచిపూడికి ప్రపంచ రికార్డ్




