రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్
బెంగళూరు, దిల్లీ,డిసెంబర్ 28(జనంసాక్షి): బ్రిగేడ్ రోడ్డు సమీపంలోని చర్చ్ స్గీట్‌లో కోకోనట్ గ్రూవ్ ¬టల్ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు మాల్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అత్యంత అప్రమత్తత (హై అలెర్ట్) ప్రకటించారు. ప్రస్తుత పేలుడులో తీవ్రత తక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎలక్గానిక్ డ్తిౌనేటర్ సహకారంతో బాంబును పేల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి, పోలీసు అధికారులు అభిషేక్ గోయల్, అలోక్ కుమార్‌లు సంఘటన స్థలంలోనే ఉంటూ పరిస్థితుల్ని సమీక్షించారు. కొత్త ఏడాదిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు గత కొద్ది రోజులుగా బ్రిగేడ్ రోడ్డు, ఎంజీరోడ్డు, చర్చ్ స్గీట్‌లలో ముమ్మర తనిఖీలు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు బ్రిగేడ్ రోడ్డులో డిసెంబరు 31న కనీసం రెండు లక్షల మంది చేరతారు. ప్రస్తుత పేలుడుతో స్థానికులు ఆందోళనకు గురికాగా, పోలీసులు అప్రమత్తమయ్యారు.
పేలుడు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర మంత్రి సదానంద్ణొడ పరిశీలించారు. పేలుళ్లతీవ్రత తక్కువగా వున్నట్టు పోలీసులు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. మరోవైపు పేలుళ్లపై కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. కేంద్ర నుంచి అన్ని విధాలుగా సహాయం అందేట్టు చూస్తామని ఆయన అన్నారు.
బాంబుపేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిందిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీల్లీ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే చాందినీాక్, పహార్‌గంజ్, సరోజినినగర్ తదితర ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పెంచారు. బెంగళూరు ఘటన నేపథ్యంలో కోల్‌కతా, ముంబయి, పుణె తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.





