కూడంకుళం అణుకేంద్రంపై నేడు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎన్‌ రాధాకృష్ణన్‌, దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. అణువిద్యుత్కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పలువురు కార్యకర్తలు కేంద్రం భద్రత విషయంలో సందేహాలు లేవనెత్తుతూ న్యాయస్థానంలో కేసులో పెట్టారు.