కృష్ణానదిపై మరో బ్యారేజీ

అమరావతి నీటి కోసం ప్రత్యేకంగా నిర్మాణం

రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులకు ఉత్తర్వులు

అమరావతి,జూన్‌8(జనం సాక్షి ): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి పైన 23 కి.విూ దూరంలో వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నూతన రాజధాని అమరావతికి నీటి సరఫరా కోసం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనిప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సముద్రంలో కలిసే నీటిని దీనిద్వారా నిలవు చేసుకునేలా ప్లాన్‌ చేస్తారు.