కృష్ణారావు మృతి తీరని లోటు -ఐజేయూ-టియుడబ్ల్యూజె
హైదరాబాద్, జనంసాక్షి :
సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం. కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి
వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియు డబ్ల్యూజె ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు
నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడడం కృష్ణారావు స్వభావమన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలపైగా మీడియా రంగానికి సేవలందించడమే కాకుండా సామాజిక మేధావిగా, ప్రజల గొంతుగా విశ్లేషణలు చేసేవారని తెలిపారు. తమ సంఘం తో కృష్ణారావు కు నాలుగు దశాబ్దాల
అనుబంధం ఉందని వారు పేర్కొన్నారు. కృష్ణారావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ
సంభ్యులకు వారు సానుభూతిని తెలిపారు.