కృష్ణా జిల్లాలో చేపల వాన
కృష్ణా: జిల్లాలో చేపల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో నిన్న రాత్రి వర్షం పడింది. వాన కురవటం ప్రారంభమైన కాసేపటికే చేపలు పడుతుంటడాన్ని గ్రామస్తులు గమనించారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చేపల వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా..వర్షం ద్వారా చేపలు పడటంతో చూస్తూ ఉండిపోవడం గ్రామస్తుల పనైంది