కృష్ణ ఎమ్మార్పీఎస్ నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు
పార్లమెంటలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడతారని సమాచారంతో పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చి ఇచ్చింది కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేపట్టలేదని అన్నారు మాట ఇచ్చి తప్పిన బిజెపి పార్టీకి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు హామీ నెరవేర్చకుండా తెలంగాణలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీకి నిరసన తెలిపాలని ఉద్దేశంతో సడక్ బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అరెస్టు అయిన వారిలో నారాయణపేట జిల్లా కన్వీనర్ నాగేష్ కృష్ణ మండల అధ్యక్షులు తేజ మండల నాయకులు బి వెంకటేష్ కార్యదర్శి కర్రెప్ప తదితరులు పాల్గొన్నారు