Tuesday, 3 November 2026

కెజిఎఫ్‌`2కు మరో రికార్డు సొంతం

కరోనా థర్డ్‌ వేవ్‌ భయాన్ని దాటుకుని ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రాల్లో ’కేజీయఫ్‌ చాప్టర్‌2’ ఒకటి. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల పరంగా కేవలం హిందీలోనే రూ.430కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో విడుదలైన చిత్రాల్లో ’మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌’ కేటగిరీలో ఐఎండీబీ సంస్థ విడుదల చేసిన జాబితాలో ’కేజీఎఫ్‌2’ చిత్రం 8.5 ఐఎండీబీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు కైవసం చేసుకుంది. సినిమా రేటింగ్స్‌, రివ్యూస్‌ ఇచ్చే ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్స్‌లో 90శాతం స్కోరు సాధించిన తొలి చిత్రంగా ’కేజీయఫ్‌2’ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. దక్షిణాది భాషలు, హిందీతో కలిపి ఓర్‌మ్యాక్స్‌పవర్‌ రేటింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషమని, ఇది అరుదుగా దక్కే గౌరవమనీ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కేజీఎఫ్‌2’ చిత్రంతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తుంపు తెచ్చుకున్న యశ్‌ (జజీబఠ)నుంచి కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. యశ్‌ నుంచి రాబోయే చిత్రం ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.