కెజిబివి పాఠశాల ఘటన బాధ్యుతలపై చర్య తీసుకోవాలి
నిర్మల్,జూలై7(ఆర్‌ఎన్‌ఎ): భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణను ప్రక్షాళన చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. భైంసాలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి పురుగులతో కూడిన అన్నం తిని అస్వస్థత చెందారు. బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌రావుపటేల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారి తక్షణమేచర్యలు తీసుకోవాలన్నారు. పురుగుల అన్నం అందించడంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డింపుపై విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.