కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం*
మునగాల మండల కేంద్రంలో గల కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి చొరవ కింద కలకోవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు చదువుకుంటున్న ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ ఆరుగురు విద్యార్థినిలకు కెనరా బ్యాంకు జ్యోతి పథకం కింద 22 వేల 500 రూపాయలు ఉపకార వేతనం కింద బ్యాంక్ మేనేజర్ మధుసూదన్ ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, కెనరా బ్యాంక్ విద్యాజ్యోతి పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతివవంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ఉపకార వేతనాలు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో విద్యను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కెనరా బ్యాంక్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో తమ కెరీర్ని నిర్మించుకోవడానికి ఎంతో కృషి చేయాలని, సాధారణ జ్ఞానంతో పాటు విద్య ద్వారా జీవితానికి పునాది వేసుకునేలా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కలకోవ జడ్.పి.హెచ్.ఎస్ హెడ్మాస్టర్ పప్పుల వీరబాబు, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్ బాబు, ఆఫీసర్స్ విజయభాస్కర్, రామాకిరణ్, కళ్యాణ్, శ్రీను, వీరబాబు, సిబ్బంది ,వసిమేకల సురేష్, లోకా చారి, శ్రీనివాసచారి, గోపి, వెంకటేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.