ప్రజలకు మొహంచూపించలేకనే ఫ్లెక్సీల ఏర్పాటు
ముందు కెసిఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
ప్రధాని సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు: బండి
హైదరాబాద్,జూలై4(జనం సాక్షి): కేసీఆర్ ఎవరో కోన్ కిస్క.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మా పార్టీకి లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్టాన్రికి బీజేపీ ఏం చేసిందో..ఏం చేస్తోందో అనే వివరాలను తెలంగాణ సమాజానికి స్వయంగా ప్రధాని మోడీ వివరించారని చెప్పారు. బీజేపీపై ప్రేమాభిమానాలు చూపుతున్న తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. విజయవాడకు వెళ్లేందుకు సోమవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన సందర్భంగా బండి సంజయ్ విూడియాతో మాట్లాడారు. కేసీఆర్? తొలుత తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు మొహం చూపించే ధైర్యం సీఎంకు లేదని కామెంట్ చేశారు. మోడీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే.. కేసీఆర్ హైదరాబాద్ నగరమంతా ప్లెక్సీలను పెట్టించుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారం కోసం టీఆర్‌ఎస్ ఖర్చు చేసిన డబ్బంతా ప్రజలదేనని ఆరోపించారు. కేసీఆర్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత నిన్నటి ’విజయ సంకల్ప సభ’ తో మరోసారి బహిర్గతమైందన్నారు. ప్రధాని మోడీ సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని సంజయ్ చెప్పారు. ముందు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రజల వద్ద మొహం చెల్లక సీఎం కేసీఆర్ పారిపోతున్నారని విమర్శించారు. మోదీని ఎదుర్కోవడానికి
ప్లెక్సీల కోసం ఖర్చుపెట్టిన డబ్బులు పెద ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నారు.ప్రధాని సభకు సకరించిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ విూద ప్రజలకు ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతమయిందన్నారు. ముఖ్యమంత్రి తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని బండి సంజయ్ అన్నారు.
కెసిఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు




