Wednesday, 4 November 2026

కెసిఆర్‌ ఉద్యోగం ఊడగొడితేనే యువతకు ఉద్యోగాలు

కొడంగల్‌ ప్రచారంలో రేవంత్‌ సెటైర్లు

వికారాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఉద్యోగంలో ఉంటే నిరుద్యోగుఉల రోడ్డు విూద ఉండాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతమడక చీటర్‌ కేసీఆర్‌ తనపై కక్ష కట్టారన్నారు. ‘నన్ను ఓడించేందుకు రూ. 100 కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్‌ పంపించారు’ అని ఆరోపించారు. కొడంగల్‌లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌ నమ్మకాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హావిూ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కెసిఆర్‌లాగా ఫామ్‌హౌజ్‌లో పండుకుని పాలన చేయడం కాదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఇచ్చిన హావిూలను అమలు చేయడానికి పనిచేస్తామని అన్నారు.