Wednesday, 4 November 2026

తనయుడితో కలసి క్రికెట్‌ చూసిన సానియా

సోషల్‌ విూడియా ద్వారా వెల్లడించిన టెన్నిస్‌ స్టార్‌

హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా తాజాగా మళ్లీ సోషల్‌ విూడియాలోకి అడుగుపెట్టింది. తమ చిన్నారి తనయుడికి స్వాగతం పలుకుతూ.. ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్‌ తొలి ఫోటోను షేర్‌ చేసుకుంది. తన కుమారుడితో కలిసి షోయబ్‌ మాలిక్‌ ఆడుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ను టీవీలో చూశానంటూ మురిసిపోయింది. తల్లిగా నేను, కుమారుడిగా నా చిన్నారి ఇజాన్‌ ఈ ప్రపంచంలోకి వచ్చి 5 రోజులైంది. ఇద్దరం కలిసి తండ్రి ఆడుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ కూడా వీక్షించాం. మాకు ఇది నిజంగా చాలా పెద్ద మ్యాచ్‌. గతంలో ఎప్పడూ సాధించనంత గొప్ప విజయం. ఇంతకు ముందెన్నడూ పొందనంత మధురానుభూతి…’ అంటూ వ్యాఖ్యానించింది. షోయబ్‌ మాలిక్‌, సానినయా విూర్జా దంపతులకు మంగళవారం కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అతడికి ఇజాన్‌ విూర్జా మాలిక్‌గా నామకరణం చేసినట్టు ఈ జంట వెల్లడించారు.