మంత్రి నక్కా ఆనంద్ బాబు
గుంటూరు,నవంబర్2(జనంసాక్షి): తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఎవ్వరూ నమ్మలేదని మంత్రి ఆనందబాబు చెప్పారు. గతంలో ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన కెసిఆర్ ఎందుకు వెనక్కి పోయారని అన్నారు. తాము ఆయన ఫ్రంట్ గురించి ఎన్నడూ కామెంటం చేయలేదన్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవడంతో కెసిఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అదేపనిగా టిఆర్‌ఎస్
నేతలు విమర్వలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. టిడిపి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. బీజేపీ, వైసీపీది దొంగ కాపురం అంటూ ఎద్దేవాచేశారు. తెలుగు జాతిపై కుట్రలను ఎదుర్కోవడానికే కూటమి ఏర్పాటు కాబోతోందన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన మోదీని గ్దదె దింపడమే టీడీపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీపై అన్ని వర్గాల ప్రజలలో అసహనం పెరిగిందని, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను కలిశామని ఆనందబాబు చెప్పారు. ఇందులో తప్పు లేదన్నారు. రాజకీయాల్లో కాలానుగుణంగా పొత్తులు ఉంటాయన్నారు.




