కె జి బి వి ని సందర్శించిన మండల విద్యాదికారి

దోమ కె జి బి వి పాఠశాల ను మండల విద్యాధికారి హరిశ్చందర్ సందర్శించి తరగతుల నిర్వహణ రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. భోజన విధానాలను విద్యార్థుల ను అడిగి తెలుసుకోవడమే కాకుండ వసతులను గూర్చి కనుక్కోవడం జరిగింది. విద్యార్థుల కు మెరుగైన విద్యను అందించాలని బోదన సిబ్బందిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె జి బి వి SO  మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.