కేంద్రం నిధులతోనే

గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి
– చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవటం సిగ్గుచేటు
– రాజధానిలో ప్రభుత్వ భవనాలకోసం కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చింది
– వాటిలో ఒక్కదానికి శంకుస్థాపనలు చేయలేదు
– బాండ్ల జారీ ద్వారా సేకరించిన డబ్బుకు లెక్క చెప్పాలి
– చంద్రబాబుది ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమే
– బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి, ఆగస్టు15(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరుగుతుందని, కానీ చంద్రబాబు ఇదంతా తన ఘనతేనని చెప్పుకుంటున్నాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. భారత 72వ స్వాతంత్య దినం సందర్భంగా ఏపీ బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు.రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని అన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని బాబుపై కన్నా మండిపడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌ బీరువాలో దాచారా అంటూ బాబును ప్రశ్నించారు. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాల కోసం రూ. 3,500 కోట్లు అవసరం అవుతుందని అంచనాలు రూపొందిస్తే, దానిలో 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, అయినా ఇప్పటి వరకు వాటికి శంకుస్థాపన చేయలేదని కన్నా మండిపడ్డారు. అమరావతి ఇటుక పేరిట వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయే ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని తీవ్ర విమర్శలు చేశారు. రెండుకళ్ల సిద్ధాంతంలో రాటుదేలిన బాబు చివరకి పొత్తుల్లో  కూడా అదే ఫాలో అయ్యారని ఎద్దేవా చేశారు. గ్రావిూణప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని నరేంద్రమోదీ చలవేనని అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలు అందనున్నాయి. సెప్టెంబర్‌ 25 నుంచి పథకం అమలవుతుందని ప్రధాని తెలిపారు.
—————————–

తాజావార్తలు