ప్రపంచంలో మేటి రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం
కడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు విరోచిత పోరాటం
విభజన హవిూల అమలులో కేంద్రం విఫలం
ప్రత్యేక ¬దా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా హావిూ
నమ్మించి మోసం చేసిన ప్రధాని మోడీ
ప్రొద్దుటూరు సభలో మండిపడ్డ సిఎం చంద్రబాబు
కడప,అక్టోబర్30(జనంసాక్షి): కేంద్రం సహకరించకపోయినా, అభివృద్దిలో ఎపి దూసుకుని పోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి గర్వపడేలా ఏపీ రాజధానిని నిర్మిస్తామని అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరులో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి ప్రధాని మోదీ చేతులుదులుపుకున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోని…ఐదు మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏపీ ప్రభుత్వ అకౌంట్లో డబ్బులు వేసి వెనక్కి తీసుకుందని బాబు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో విద్యా సంస్థలు పూర్తి కావాలంటే… మరో 30 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ట్యాక్స్ ఇన్సెంటీవ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు విరోచితంగా పోరాడారని చంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏవిూ కోరలేదని.. విభజన చట్టంలో ఇచ్చిన హవిూలనే అమలు చేయాలని కోరామని చంద్రబాబు చెప్పారు. కొత్త రాష్ట్రానికి అండగా ఉంటారని, మోదీ హావిూలు నమ్మి భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయినా తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక ¬దా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హావిూ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని మోదీ చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడిన ఏకైక పార్టీ తెదేపాయే అని, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తమ ఎంపీలే వినిపించారన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్‌జైట్లీ సైతం ప్రత్యేక ¬దా 10 సంవత్సరాలు ఉండాలని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక¬దాకు మద్దతిచ్చాయని.. అయినా ఎందుకివ్వరని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. 2014 ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హవిూల వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే తమ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, పోలవరం పూర్తి చేయడాన్ని తన జీవితాశయంగా పెట్టుకున్నట్లు వివరించారు. పట్టిసీమ పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలానికి తీసుకొచ్చి తద్వారా రాయలసీమకు ఉపయోగపడేలా చేశామని, ఆ నీళ్లు రాకపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని 16 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు.
తొలి మూడు సంవత్సరాల పాటు ఇచ్చిన కేంద్రం.. ప్రత్యేక ¬దాపై తాము విభేదించిన తర్వాత వాళ్ల వైఖరిలో మార్పు వచ్చి నిధులను వెనక్కి తీసుకున్నారన్నారు. తెలంగాణలోని 10 జిల్లాలకు వెనుకబడిన నిధులను ఇచ్చి ఏపీపై వివక్ష చూపుతున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్‌పైనా మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు స్థానిక నేతలు పాల్గొన్నారు. బాబు రాకతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.




