హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను చట్టరూపంలోకి తేవాలని ప్రయత్నిస్తోందని సీపీఎం ఆరోపించింది. ఈమేరకు ఇవాళ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఇక్కడి ఎంబీ భవన్‌లో ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆర్డినెన్స్‌ల పేరుతో మోదీ సర్కారు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం చేసే చట్టాలన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయని మండిపడ్డారు. ఆర్డినెన్స్‌లను చట్ట రూపంలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఎలాగైనా సరే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ తెస్తోన్న ఆర్డినెన్స్‌లను అడ్డుకోవడానికి పార్లమెంట్‌లో వామ పక్షాలతోపాటు ఇతర లౌకిక పార్టీల మద్దతును కూడగడతామని తెలిపారు. ఇందు కోసం ఏప్రిల్‌లో జరుగబోయే పార్టీ జాతీయ మహాసభల్లో కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు.





