బెయిలు మంజూరు..
లక్నో,జనవరి14(జనంసాక్షి): కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి రాంపూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో నఖ్వీ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ కోర్టులో విచారణ జరిగింది. నఖ్వీని కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఆయనను జుడిషియల్ కస్టడీకి తరలించారు. తర్వాత ముక్తార్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆయనకు ఈ శిక్ష విధించింది. దీంతో ఆయన్ను రాంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం నఖ్వీ పిటిషన్‌ను పరిశీలించిన రాంపూర్ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది





