న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): క్రమంగా తగ్గుతూ వస్తున్న ప్రెటోల్, డీజిల్ ధరలు మరోమారు మరింత తగ్గనున్నాయి. అయితే ఇంకా నిర్ణయం కాలేదు. లీటరుపై రూ. 2 వరకు తగ్గనున్నాయని సమాచారం. అందుకోసం అయిల్ కంపెనీలు సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ సమావేశంలో అయిల్ కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారల్ ధర రూ. 45 డాలర్లుకు చేరింది. నేపథ్యంలో అయిల్ ధరలు తగ్గించాలని సదరు కంపెనీలు నిర్ణయించాయి. అయితే వచ్చే నెల 7న దేశ రాజధాని హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయిల్ ధరలు తగ్గించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుందని ప్రతిపక్షలు ఆరోపణలు చేస్తున్నాయి.వాస్తవానికి అంతర్జాతీయంగా ఉన్న చమురు బ్యారెల్ ధర ప్రకారం ధరలు ఇప్పటికే చాలా తగ్గాల్సి ఉంది. కానీ మళ్లీ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ఒకేసారి పెరిగితే ధరలు మళ్లీ పెంచాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ప్రణాళికాబద్దంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
మళ్లీ తగ్గనున్న పెట్రో ధరలు





