Tuesday, 3 November 2026

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో వారం రోజులుగా బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన్ను ఐసియులోనే ఉంచి డయాలసిస్‌ కొనసాగిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన్ను పరామర్శించేందుకు మంగళవారం ఉదయం ఆసుపత్రికి ఆయన కుమారుడు తరలివచ్చారు. విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఎవరూ పెదవి విప్పడంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *